Advertisement

Main Ad

Aa Kakarakaya Koora | Teasel Gourd | బోడ కాకరకాయ

  Boda Kakarakaya (బోడ కాకరకాయ)


తయారికి కావలసిన పదార్థాలు :

  1. బోడ కాకరకాయలు : 250 గ్రా 
  2. ఉల్లి గడ్డలు : 2
  3. కరివేపాకు, కోతిమిర  తగినంత 
  4. ఎండు మిర్చి : 5
  5. పోపు దినుసులు తగినని 
  6. పసుపు ; 1 స్పూన్ 
  7. ఉప్పు , కారం : తగినంత 
  8. టమాట రసం : 1/2 కప్పు 
  9. నువ్వుల పొడి : 3 స్పూన్స్ 
  10. ధనియాల పొడి : 1 స్పూన్ 

తయారి విధానం :

  • బోడ కాకరకయలను శుబ్రంగా  కడిగి వాటిని పొడుగ్గా  కట్ చేసుకొని వాటిని ఒక గిన్నెలో వేసి కొంచెం ఉప్పు  వేసి సన్నని మంట ఫై 5 ని" పాటు ఉడికిన్చుకొని పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై ఒక గిన్నె పెట్టి కురకి తగినంత నూనే పోసి పోపు దినుసులు, ఎండు మిర్చి, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి. కట్ చేసుకున్న బోడ కాకరకాయలను కూడా వేసి కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి. తరువాత టమాట రసం వేయాలి, కూరకి  తగినంత ఉప్పు, కారం వేసి బాగా వేగానివాలి.
  • చివరగా నువ్వుల పొడి, దనియ పొడి వేసాక, కొత్తిమిర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

నోట్ :

  • పెద్ద బోడ కాకరకాయలు ఐతే చేదుగా ఉండవు.
  • వీటిని ఉడికించడానికి ఉప్పు వేయాలి , కానీ నీరు పొయొద్దు.