Advertisement

Main Ad

Prawn Pickles | రొయ్యల నిల్వ పచ్చడి

Prawn Pickles । రొయ్యల నిల్వ పచ్చడి


తయారికి కావలసిన పదార్థాలు : 

  1. పచ్చి రొయ్యలు : 500గ్రాములు 
  2. అల్లం వెల్లులి పేస్టు : 5 స్పూన్స్ 
  3. కారం:100గ్రాములు 
  4. ఉప్పు తిగినంత
  5. పసుపు :1/2 స్పూన్ 
  6. మెంతుల పౌడర్ : 2స్పూన్స్ 
  7. గరం మసాలా : 1స్పూన్ 
  8. నూనె : 250 ఎం.ల్
  9. నిమ్మ రసం :5 స్పూన్స్
  10. పోపు దినుసులు తగినన్ని
  11. కరివేపాకు 
  12. పొట్టు తీసిన వెల్లులి రిబ్బలు 

తయారి చేయు విధానం :

  • ముందుగా పచ్చి రోయాలను శుబ్రంగా చేసుకొని పక్కనపెట్టాలి.
  • స్టవ్ ఫై కడాయ్ పెట్టి నూనె పోసి వేడయ్యాక పచ్చి రొయ్యలను నూనెలొ వేసి బాగా వేగనివ్వాలి.  కడాయ్ లో నీరు ఏమాత్రము లేకుండా రొయ్యలను వేగానిస్తూ కాస్త పసుపు వేయాలి. రొయ్యలు దగ్గరగా వచ్చేంత వరకు వేగనివ్వాలి.
  • కడాయి లో మిగిలిన నూనెను గోరువెచ్చగా చేసి అల్లం వెల్లులి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, మెంతి పొడి  వేసి కలిపాక చివరగా వేయించిన రొయ్యలను వేసి కలిపి పక్కన పెట్టాలి.
  • కడాయి లో పోపుకి తగినంత నూనె పోసి వెల్లులి, పోపు దినుసులు , కరివేపాకు వేసి పోపు చేసి ఆ పోపును కలుపుకున్న రొయ్యల మిశ్రమంలో వెయ్యాలి.  ఈ పచ్చడి అంతా చల్లారక నిమ్మ రసం పొయ్యాలి.
  • ఈ రొయ్యల పచ్చడి సుమారుగా నెల పాటు నిల్వ ఉంటుంది.