Advertisement

Main Ad

Hyderabad Egg Spicy Curry । హైదరాబాద్ కోడిగుడ్ల మసాలా కర్రీ

Hyderabad Egg Spicy Curry । హైదరాబాద్ కోడిగుడ్ల మసాలా కర్రీ


తయారికి కావలసిన పదార్థాలు :

  1. ఉడికించిన కోడిగుడ్లు : 4
  2. నూనె
  3. ఉల్లి గడ్డలు : 2
  4. టమాట రసం : 1 కప్పు
  5. ధనియ పౌడర్ : 1స్పూన్
  6. కరివేపాకు, కొత్తిమీర
  7. పసుపు
  8. ఉప్పు, కారం
  9. పచ్చిమిర్చి : 2
  10. అల్లం వెల్లులి పేస్టు 
  11. జీలకర్ర
  12. గరం మసాలా దినుసులు : 1/2 స్పూన్ 

తయారు చేయు విధానం : 

  • స్టవ్ ఫై కడాయి పెట్టి నూనె పోసి ఉడికించిన కోడిగుడ్లను వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయుంచుకోవాలి. 
  • మరొక గిన్నె తీసుకోని నూనె పోసి వేడి అయ్యాక గరం మసాలా దినుసులు, జీలకర్ర, కరివేపాకు వేసాక తరిగిన ఉల్లి ముక్కలను వేసి బాగా మగ్గనివ్వాలి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసాక టమాటో రసాన్ని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. 
  • కూరకి తగినంత ఉప్పు, కారం ధనియాల పొడిని కూడా వేసాక కూరకు సరిపడినన్నినీళ్ళు పోయాలి, తరువాత ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసి కొద్ది సేపు మగ్గనివాలి. చివరగా కొత్తిమీర చల్లి కూరను తయారుచేసుకోవాలి.