Advertisement

Main Ad

Aloo Gobi Masala | Gobi Indian Recipe

Aloo Gobi Masala | Gobi Indian Recipe


తయారికి కావలసిన పదార్థాలు : 

  1. గోబీ : 150 గ్రా
  2. అల్గడ్డ : 150 గ్రా
  3. పచ్చి బఠానీ : 50 గ్రా
  4. సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు : 1 కప్పు
  5. టమాటో : 3
  6. అల్లం వెల్లులి పేస్టు : 2 స్పూన్
  7. కాజు : 10
  8. జీలకర్ర : 1స్పూన్
  9. సోంపు పొడి : 1 స్పూన్
  10. పసుపు , ఉప్పు , కారం : తగినంత
  11. పచ్చిమిర్చి : 4
  12. గరం మసాలా పొడి : 1 స్పూన్
  13. ధనియాల పొడి : 1 స్పూన్
  14. కొత్తిమిర
  15. నూనె

తయారు చేయు విధానం :

  • స్టవ్ ఫై కడాయి పెట్టి 1/4 లీటర్ నునె పోసి మగనివ్వాలి, కడిగి ఆరబెట్టిన గోబీ, అల్గడ్డ ముక్కలను నూనెలొ వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై మరొక గిన్నె పెట్టి కూరకి తగినంత నూనె వేసాక జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగాక టమోటో, కాజు పేస్టుని కూడా కూరలో వేయాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమంలో పసుపు, ధనియాల పొడి, సోంపు పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కారం తగినంత వేసి మగ్గనివ్వాలి, అవసరం ఐతే కొన్ని నీళ్ళు పోయాలి.
  • తయారు చేసుకున్న మాసాలలో వేయించిన గోబీ, ఆలుగడ్డ ముక్కలను వేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి చివరగా మసాలా అంత ముక్కలకు పట్టేసాక చివరగా కొత్తిమిరను చల్లి స్టవ్ ఆపి వేయాలి.