మెంతి కూర ఆకులను కడిగి సన్నగా తురుముకొని దానిలో జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు ఇంగువ పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
గోధుమ పిండి లో ఫై న కలిపిన మెంతి మిశ్రమాన్ని వేసి కొంచెం నూనె వేసి కలిపి తరువాత నీళ్ళు పోసి కలిపి చెపాతి పిండిలాగా మెత్తగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని చెపాతిలాగా చేసి పెనం ఫై నెయ్యి వేసి దోరగా కాల్చుకోవాలి.