పొట్లకాయను కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి కట్ చేసిన పొట్లకాయను వేసి కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు వేసి ఉడికించి నీళ్ళు వడపోసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై పాన్ పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిగడ్డలను వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఉడికించిన పోట్లకాయలను వేసి చిటికెడు పసుపు కూడా వేసి కలుపుకోవాలి.
5 నిమిషాల తరువాత బాదాం పొడి, నువ్వుల, కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకున్న తరువాత కూరకి తగినంత ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి అవసరం ఐతే కొన్ని నీళ్ళు పోసుకోవాలి.
ఇలా మగ్గుతున్న కూరలో గరం మసాలా, ధనియాల్ పొడి, కొత్తిమిరను వేసి కలుపుకోవాలి.