Advertisement

Main Ad

Coconut Chutny | Kobbari Chutney

Coconut Chutney | Kobbari Chutney






తయారికి కావలసిన పదార్థాలు :

  1. పచ్చి కొబ్బరి : 2 కప్పులు
  2. పచ్చిమిర్చి : 6
  3. ఎండుమిర్చి : 2
  4. పుట్నాల పప్పు : 1/2 కప్పు
  5. చింతపండు : చిన్న నిమ్మకాయ అంత
  6. ఉప్పు
  7. పసుపు
  8. నూనె
  9. ఆవాలు , జీలకర్ర : 1 స్పూన్
  10. ఇంగువ పొడి : చిటికెడు
  11. వెల్లులి రిబ్బలు : 6
  12. మినపప్పు : 1 స్పూన్
  13. కరివేపాకు , కొత్తిమీర

తయారు చేయు విధానం : 

  • స్టవ్ ఫై కడాయి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించి వాటిని మిక్స్ జార్లో తీసుకోవాలి.
  • ఇందులోనే వెల్లుల్లి, జీలకర్ర, నారా లేని చింతపండు, పుట్నాల పప్పు, కొత్తిమీర వేసి ఒక సారి మిక్స్ చేసి కొన్ని నీళ్ళు పోసి మరో సారి మెత్తగా అయ్యేవరకు మిక్స్ చేయాలి. సరిపడినంత ఉప్పు వేసి రుచి చూసుకోవాలి.
  • పోపు కి చిన్న కడాయి స్టవ్ ఫై పెట్టి 2స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర,  మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు మరియు కరివేపాకు వేసి పోపు చేసుకొని ఈ పోపుని కొబ్బరి చట్నిలో వేసి కలుపుకోవాలి. 
  • ఈ చట్ని ఇడ్లి, దోస, వడ లోకి చాల రుచిగా ఉంటుంది.