సకినాలు | Sakinaalu
తయారికి కావలసిన పదార్థాలు :
- బియ్యం 1 కే జి
- తెల్ల నువ్వులు 150 గ్రాములు
- వాము 1 స్పూన్
- ఉప్పు తగినంత
- నూనె
- నీరు
తయారు చేయు విధానము :
- 1 కే జి బియ్యాన్ని ముందు రోజు నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పిండి పట్టించాలి.
- ఒక వెడల్పాటి గిన్నెలో పిండి పోసి పిండిలో తగినంత ఉప్పు, వాము, నువ్వూలు కలిపి నీటిని పోస్తూ ముద్దలా కలుపుకోవాలి . రొచ్చు కాకుండా పిండిని కలుపుకోవాలి.
- ఒక కాటన్ బట్ట ఫై పిండిని చిన్న ముద్దలుగా చేసి చేతితో పిండిని వడి తిప్పుతూ రింగులుగా పోయాలి.
- స్టవ్ ఫై కడాయి పెట్టి నునె పోసి బాగా మరగనివ్వాలి . ఈ పిండితో చేసిన సకినాలను నూనెలో వేసి కాల్చుకోవాలి.