Chicken Pickle | చికెన్ నిల్వ పచ్చడి
తయారికి కావలసిన పదార్థాలు :
- బోన్ లెస్ చికెన్ : 500గ్రామలు
- అల్లం వెల్లులి పేస్టు : 5 స్పూన్స్
- కారం:100గ్రాములు
- ఉప్పు తిగినంత
- పసుపు :1/2 స్పూన్
- మెంతుల పౌడర్ : 2స్పూన్స్
- గరం మసాలా : 1స్పూన్
- నూనె : 250 ఎం.ల్
- నిమ్మ రసం :5 స్పూన్స్
- పోపు దినుసులు తగినన్ని
- కరివేపాకు
- పొట్టు తీసిన వెల్లుల్లి రిబ్బలు
- ధనియాల పొడి : 1స్పూన్
- కాజు :1/2 కప్పు
తయారు చేయు విధానం :
- ముందుగా బోన్ లెస్ చికెన్ శుబ్రంగా చేసుకొని పక్కనపెట్టాలి.
- స్టవ్ ఫై కడాయ్ పెట్టి నూనె పోసి వేడయ్యాక బోన్ లెస్ చికెన్ ను నూనెలొ వేసి బాగా వేగనివ్వాలి. కడాయ్ లో నీరు ఏమాత్రము లేకుండా చికెన్ వేగనిస్తూ కాస్త పసుపు, ఉప్పు వేయాలి. చికెన్ దగ్గరగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా చికెన్ బాగా వేగాక నీసు వాసన లేకుండా ఉంటుంది.
- నూనెలొ కాజు వేసి వేయించి పక్కన పెట్టాలి .కడాయి లో మిగిలిన నూనెను గోరువెచ్చగా చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, మెంతి పొడి, ధనియాల పొడి వేసి కలిపాక చివరగా వెహించిన చికెన్ వేసి కలిపి పక్కన పెట్టాలి.
- కలుపుకున్న చికెన్ మిశ్రమం లో కాజు కూడా వేసి కలుపుకోవాలి.
- కడాయి లో పోపుకి తగినంత నూనె పోసి వెల్లులి, పోపు దినుసులు , కరివేపాకు వేసి పోపు చేసి ఆ పోపును కలుపుకున్న చికెన్ మిశ్రమంలో వెయ్యాలి. ఈ పచ్చడి అంతా చల్లారక నిమ్మ రసం పొయ్యాలి.
- ఈ చికెన్ పచ్చడి సుమారుగా నెల పాటు నిల్వ ఉంటుంది.