Advertisement

Main Ad

Kobbari Burelu | కొబ్బరి బూరెలు

Kobbari Burelu | కొబ్బరి బూరెలు


తయారికి  కావాల్సిన పదార్థాలు :

  1. పచ్చి బియ్యం పిండి : 1కే జి 
  2. బెల్లం :3/4 కే జి 
  3. పచ్చి కొబ్బరి తురుము : 2 కపూ
  4. డాల్డా లేదా నెయ్యీ: 150 గ్రాములు 
  5. యాలకుల పొడి : 1స్పూన్ 
  6. బాదాం : 50 గ్రాములు 
  7. నూనే

తయారు చేయు విధానము :

  • 1 కే జి బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు నీటిని వడపోసి సన్నగా పిండిని పట్టించాలి . ఈ పిండిని తడి ఆరకుండా ఒక డబ్బాలో పోసి మూత పెట్టాలి.
  • 3/4 కే జి బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి 1/4 లీటర్ నీటిని పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేస్తూ ఉండ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. తరువాత  పాకం తయారు అయ్యాక  పచ్చి కొబ్బరి తురుమును పాకంలో వేసి కలుపుతూ ఉండాలి , యాలకుల పొడి, బాదాం చిన్న ముక్కలుగా చేసి వీటి అన్నింటిని పాకంలో వేయాలి .
  • డాల్డా లేదా నేయీ పాకంలో పోస్తు ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  • స్టవ్ మీదినుండి పాకంగిన్నేను దింపి బియ్యంపిండిని కొద్ది కొద్దిగా  కలుపుతూ ఉండలు లేకుండా బియ్యంపిండిని పోయాలి . చివరగా పిండి అంతా పూరి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  •  స్టవ్ మీద కడయీ పెట్టి వేయించుకోవడానికి సరిపడినంత నునే పోయాలి . పిండిని చిన్న ముద్దలుగా చేసి ఒక పాలితిన్ కవర్ ఫై  పురిల్లాగా వత్తుకొని నూనెలో వేయాలి , అవి బంగారు రంగులోకి రాగానే తీయాలి.
  • కొబ్బరి బురేలను తియ్య పప్పు తో తింటే చాల రుచిగా ఉంటాయి.