Advertisement

Main Ad

Kaju Paneer Gravy | Kaju Paneer Masala Recipe

Kaju Panneer Gravy | Kaju panneer masala recipe | జీడిపప్పు పన్నీర్ మసాలా కూర


తయారికి కావలసిన పదార్థాలు :

  1. పన్నీర్ : 200 గ్రా
  2. కాజు : 100 గ్రా
  3. టమాటో : 3
  4. ఉల్లిగడ్డలు : 2
  5. ఎండుమిర్చి : 5
  6. అల్లం వెల్లుల్లి రిబ్బలు : 3 స్పూన్స్
  7. గరం మసాలా దినుసులు : 1 స్పూన్
  8. పసుపు, ఉప్పు, కారం : తగినంత
  9. ధనియాల్ పొడి: 2 స్పూన్
  10. గరం మసాలా పొడి : 1 స్పూన్
  11. కొత్తిమీర
  12. నూనె 

తయారి చేయు విధానం :

  • మసాలా తయారి కోసం మొదటగా మిక్స్ జార్ తీసుకోని అందులో గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి రిబ్బలు, ఎండుమిర్చి, 8 వరకు కాజులు, ఉల్లిగడ్డలు వీటిని సరిపడినన్ని నీళ్ళు పోస్తూ మిక్స్ చేసుకోవాలి.
  • స్టవ్ ఫై గిన్నె పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక పనీర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకున్నాక , కాజులను కూడా వేసి వేయించుకోవాలి . వీటిని పక్కన పెట్టుకోవాలి.
  • అదే గిన్నెలో మరికొంత నూనె వేసి మిక్స్ చేసిన మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయే అంత వరకు కలుపుతూ ఉండాలి. తరువాత సన్నగా తరిగిన టమాటో ముక్కలను వేసి బాగా ఉడకనివ్వాలి.
  • ఇప్పుడు వేయించిన పనీర్, కాజు ముక్కలు వేసి కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్ళు పోసి కలిపి ముత పెట్టాలి.
  • 5 నిమిషాల తరువాత గరం మసాలా, దనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపి వేయాలి.