Advertisement

Main Ad

Bhindi Curry | Okra Curry

Bhindi Curry | Okra Curry | బెండకాయ శాకం


తయారికి కావలసిన పదార్థాలు : 


  1. బెండకాయలు : 250 గ్రా 
  2. నూనె
  3. జీలకర్ర 
  4. ఉల్లిగడ్డలు : 2 
  5. టమాటో : 2
  6. పసుపు, ఉప్పు, కారం : తగినంత 
  7. ధనియాల పొడి : 1 స్పూన్ 
  8. కొత్తిమిర , కరివేయపకు  
  9. గరం మసాలా : 1/2 స్పూన్ 

తయారు చేయు విధానం : 



  • శుబ్రం చేసిన బెండకాయలను తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి . 
  • స్టవ్ ఫై కడాయి పెట్టి బెండకాయలను డీప్ ఫ్రై చేయడానికి కావలసిన నూనె పోసి వేడి అయ్యాక బెండకాయలను నూనెలొ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై గిన్నె పెట్టి 4 స్పూన్స్ నూనె పోసి వేడి అయ్యాక జీలకర్ర, కరివేయపకు వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను వేసి వేగాక సన్నగా తరిగిన టమాటో ముక్కలను వేసి వేగాక పసుపు వేసి, ఉప్పు వేసి బాగా వేగాక కూరకు తగినంత కారం వేసి బాగా మగ్గనివ్వాలి.
  • ఇపుడు ఈ కూరలో ఫ్రై చేసిన బెండకాయలను వేసి 2 నిమిషాల తరువాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమిరను వేసి కలుపుకోవాలి.