Navaratna Laddu | నవరత్న లడ్డు
తయారికి కావలసిన పదార్థాలు :
- కాజు : 1 కప్పు
- బాదాం : 1 కప్పు
- పిస్తా : 1 కప్పు
- అవిస గింజలు ( ఫ్లేక్ సీడ్స్ ) : 1 కప్పు
- పల్లీలు : 1 కప్పు
- నువ్వులు : 1 కప్పు
- ఓట్స్ : 1 కప్పు
- రాగి పిండి : 1 కప్పు
- బెల్లం : 1 కప్పు
- నెయ్యి : 1 /2 కప్పు
- యాలకుల పొడి : 2 స్పూన్స్
తయారు చేయు విధానం :
- స్టవ్ ఫై కడాయి కాజు, బాదాం, పిస్తా, పల్లీలు, నువ్వులు, అవిస గింజలు, ఓట్స్ విటన్నిటిని విడి విడిగా వేయించి కొంచెం చల్లారక వాటిని మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఈ మిశ్రమంలో రాగి పిండి, బెల్లం యాలకుల పొడి కుడా కలిపి దానిలో కొంచెం నేయి వేసి బాగా కలిపి లడ్డు కట్టడానికి కొంచెం వేడి నీటిని కలుపుతూ లడ్డూలను కట్టాలి.
- ఈ లడ్డులను ఒక 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి.
- ఈ లడ్డులు ఆరోగ్యానికి చాల బలాన్ని చెకూరుస్తాయి.