స్టవ్ ఫై గిన్నె పెట్టి కురకి తగినంత నూనె పోసాక దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేయపకు వేసాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసి అవి వేగాక అల్లం వెల్లులి పేస్టు వేసి కాస్త పసుపు వేయాలి.
ముందుగా మునక్కయలను కట్ చేసుకొని నార తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఈ మునక్కయలను కూరలో వేసి బాగా కలిపి కాసేపు నూనెలొ మగ్గనివ్వాలి.
ఇపుడు సన్నగా తరిగిన టమాటో లను కూరలో వేసి కలిపి ఉడకనివ్వాలి, కురకు తగినంత ఉప్పు, కారం వేసి మునక్కడలు మగ్గడానికి కావలసిన నీళ్ళను పోసి కూరని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి.
చివరగా కూరలో దనియ పొడి, గరం మసాలా, కొత్తిమిర వేసి కలిపి రుచి సరిగా ఉందా చూసుకోవాలి.