స్టవ్ ఫై గిన్నె పెట్టి నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, తరిగిన ఉల్లిగడ్డలను వేసి కొంచెం వేగనివ్వాలి. తరువాత 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలిపాక అల్లం వెల్లులి పేస్టు వేయాలి.
ఇపుడు తరిగిన పచ్చిమిర్చి, టమాటో ముక్కలను వేసి వేగానిచ్చక ఉడికించిన రాజ్మ గింజలను వేసి కలిపాక 2 నిమిషాల తరువాత రాజ్మ ఉడికించిన నీళ్ళను పోసి కలుపుకోవాలి.
తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసిన 2 నిమిషాలకు కసూరి మేతి పొడి ని కూడా వేసి 2 స్పూన్ ల వెన్నెవేసి చివరగా కొత్తిమిరను చల్లుకోవాలి.