మెంతి కూర ఆకులను ముందుగా కడిగి సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై గిన్నె పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిగడ్డలు వేసాక అల్లం వెల్లులి పేస్టు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన మెంతి ఆకులను, పసుపు వేసి వేగనివ్వాలి.
తరువాత సన్నగా తరిగిన టమాటో వేసి బాగా మగ్గనివ్వాలి, అవసరం ఐతే కొన్ని నీళ్ళు పోయాలి.
కూరకి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమిర వేసి కలిపి మరింత సేపు మగ్గనివ్వాలి.