Thokkudu Laddu | తొక్కుడు లడ్డు
తయారికి కావలసిన పదార్థాలు :
- శెనగ పిండి :1/2 కె జి
- పంచదార : 1/2 కే జి
- నూనె : 1/4 కే జి
- తినే సోడా : 1/2 టేబుల్ స్పూన్
- యాలకుల పొడి :1/2 టేబుల్ స్పూన్
- నెయ్యీ
తయారు చేయు విధానం :
శెనగ పిండి లో తినే సోడా వేసి జంతికల పిండిలా తడపాలి. ఈ పిండిని చిన్న రింగులుగా చేసి నూనెలో ఎర్రగా వేగనిచ్చి తీయాలి. అలా మొత్తం పిండిని రింగులుగా చేసిన తరువాత వీటిని మిక్సిలో వేసి పౌడర్ చేయాలి .
పంచదార,యాలకుల పొడిని కలిపి మిక్సి లో వేసి పౌడర్ చేసి, ఈ మిశ్రమంలో రింగుల పౌడర్ కలపాలి. దీనిలో నెయ్యీ మరిగించి కలపాలి, వేడిగా ఉన్నపుడే ఈ మిశ్రమాన్నిలాడ్డులుగా చేయాలి.