Boti Chaaru | Gizzard Curry | బోటి చారు
తయారికి కవలసిన పదార్థాలు :
- బోటి : 250 గ్రా
- ఉల్లి గడ్డలు : 100 గ్రా
- పుదినా , కరివేపాకు , కొత్తిమిర
- అల్లం వెల్లుల్లి పేస్టు : 2 స్పూన్స్
- పసుపు , ఉప్పు , కారం : తగినంత
- టమాట : 2
- దోసకాయ : 1
- నూనె : తగినంత
- పచ్చిమిర్చి : 5
- ఎండు కొబ్బరి పొడి : 3 స్పూన్స్
- ధనియాల్ పొడి : 1 స్పూన్
- జీలకర్ర , మెంతి పొడి : 1 స్పూన్
- గరం మసాలా దినుసులు
- చింతపండు రసం : 1 కప్పు
- శెనగ పిండి : 3 స్పూన్స్
తయారు చేయు విధానం :
- శుబ్రంగా కడిగిన బోటి తీసుకొని పక్కనపెట్టుకోవాలి.
- స్టవ్ ఫై వెడల్పాటి గిన్నె పెట్టి కూర కి తగినంత నూనె పోసి వేడయ్యాక దానిలో గరం మసాలా, ఉల్లి ముక్కలు, పుదినా, కరివేయపకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి పేస్టు, టమాటో, దోసకాయ ముక్కలను వేసి, పసుపు కూడా వేసి, విటన్నిటిని వేగనివ్వాలి.
- ఇవి వేగాక చింతపండు రసం పోసి, కారం వేసి కలపాలి తరువాత బోటి వేసి నూనెలొ వేగనివ్వాలి.
- ఇలా 10 నిముషాలు పాటు ఉడకనిచ్చకా శెనగ పిండిని కొద్దిగా వేరే గిన్నెలో వేసి తడిపి బోతిలో వెయ్యాలి , కొబ్బరి పొడిని కూడా కూరలో వేసి కలిపాక మరొక 10 నిముషాలు పాటు ఉడకనివ్వాలి. చివరగా అవసరం ఉంటె కొద్దిగా నీరు పోసుకోవచ్చు.
- చారు తయారు అయ్యాక తగినంత ఉప్పు వేయాలి , దనియ పొడి, జీలకర్ర మెంతి పొడి వేసి బాగా కలుపుకొని చివరగా కొత్తిమిర చల్లుకోవ్వాలి.