ముందుగా కడిగిన దొండకాయలను తీసుకోని పొడుగ్గా , గుత్తిగా కట్ చేసుకొని స్టవ్ ఫై ఒక గిన్నె పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక దొండకాయలను వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 5 నిముషాలు పాటు ఉడకనివ్వాలి .
ఉల్లి కారం తయారీ :
ఒక కడాయి తీసుకోని దానిలో 1 స్పూన్ నూనె వేసి తరిమిన ఉల్లిగడ్డలు , జీలకర్ర , వెల్లుల్లి , ఎండు మిర్చి వేసి కాస్త వేగాక వాటిని మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి .
ఈ మసాలాను దొందకయాల్లో నింపి అదే కడాయి లో మరింత నునే వేసి కరివేయపకు వేసి , దొండకాయలను వేసి బాగా మగ్గనివ్వాలి . మంట సన్నగా పెట్టుకోవాలి .
చివరగా తయారైనా దొండకాయ ఉల్లి కారంలో సన్నగా తరిమిన కొత్తిమీర వేయాలి.