శుభ్రంగా ఉన్న మక్క బుట్టలను వలిచి కొంచెం గరుకుగా పేస్టు చేసి అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లులి తురుము , ఉప్పు , కరం, పుదినా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిముక్కలు, జీలకర్ర, ఎండుమిర్చి ప్లేక్స్ వేసి అన్నిటిని కలపాలి.
మిశ్రమాన్ని కలిపేటప్పుడు తడి లేకుండా చూసుకుంటే గారెలు చక్కగా వస్తాయి.
కడాయిలో నూనె పోసి వేడయ్యాక గారెల పిండిని వడలుగా వత్తుకొని అన్నింటిని ఒకే సారి వేసి వేగనివ్వాలి.నోరూరించే మక్కా గారెలు తయారవుతాయి.