Advertisement

Main Ad

Stuffed Masala Neti Birakaya | మసాల నేతి బీరకాయ

Stuffed Masala Neti Birakaya | మసాల నేతి బీరకాయ


తయారికి కావలసిన పదార్థాలు :

  1. నేతి బీరకాయలు : 250 గ్రా
  2. ఉల్లి గడ్డలు : 2
  3. టమాట :2
  4. కరివేపాకు, కొత్తిమిర 
  5. పచ్చి కొబ్బరి : 1 కప్పు 
  6. మసాలా దినుసులు 
  7. జీలకర్ర , ఆవాలు 
  8. పసుపు : 1/2 స్పూన్ 
  9. ఉప్పు , కారం తగినంత 
  10. ధనియాల పొడి :1 స్పూన్ 
  11. నూనె :5 స్పూన్ 

తయారు చేయు విధానం :

  • మొదటగా  కడిగిన నేతి బీరకాయలను పొట్టు తీసి మసాలా నింపే విధంగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి . గింజలను తీసివెయ్యాలి 
  • కడాయి పెట్టి 1 స్పూన్ నూనె వేసి అందులో తరిగిన ఉల్లి ముక్కలు , టమాటో ముక్కలు వేసి కొంచెం వేగాక వాటిని మిక్సి జార్ లో వేసి అందులో పచ్చి కొబ్బరి, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మిక్సి పట్టాలి . 
  • ఈ మాసాలను కట్ చేసుకున్న నేతి బీరకాయలలో నింపాలి . 
  • స్టవ్ ఫై గిన్నె పెట్టి వేడయ్యాక కూరకి తగినంత నూనె పోసి మసాలా దినుసులు , పోపు దినుసులు వేసి , కరివేపాకు వేసి వేగాక ఈ మసాలా నింపిన నేతి బీరకాయలను వేసి బాగా మగ్గనివ్వాలి, రసం కోసం కొంచెం  నీరు  పోసి కూర ను వేగనివ్వాలి . 
  • ఇలా కూర తయారీ  అయ్యాక కొత్తిమిర చల్లాలి