Advertisement

Main Ad

Mutton Kheema Garjelu | మటన్ కీమా గర్జెలు

Mutton Kheema Garjelu | మటన్ కీమా గర్జెలు :


తయారికి కావలసిన పదార్థాలు :

  1. మటన్ కీమా : 250 గ్రా 
  2. గోధుమ పిండి : 1 కప్పు 
  3. మైదా పిండి : 1 కప్పు 
  4. గరం మసాలా : 1 స్పూన్ 
  5. నూనె : తగినంత 
  6. అల్లం వెల్లుల్లి పేస్టు : 2 స్పూన్స్
  7. ఉప్పు, కారం : తగినంత 
  8. నిమ్మ రసం : 2 స్పూన్స్ 
  9. ధనియాల పొడి : 1స్పూన్ 
  10. ఎండు కొబ్బరి పొడి : 4 స్పూన్ 
  11. కొత్తిమీర

తయారి విధానం : 

  • గోధుమ పిండి , మైదా పిండి ని కలిపి పూరి పిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి 5 స్పూన్స్ నునె పోసి వేడి అయ్యాక కీమను వేసి నిరులేకుండా ఫ్రీ చేసుకోవాలి. తరువాత ఈ కీమాలో అల్లం  వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. కొత్తిమీరను వేసి వేగాక నిమ్మరసం పోసి కీమాను పక్కనపెట్టాలి.
  • పిండి ని పూరిలాగా వత్తుకొని ఒక్కొక్క పూరిలో 1 1/2 స్పూన్ కీమను పెట్టి గర్జ్జెలుగా చేసుకొని పక్కనపెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి నూనె పోసి చేసుకున్నకీమా గర్జేలను వేసి కాల్చుకోవాలి.
  • ఇవి 5 రోజుల పాటు నిలువ ఉంటాయి.