Mutton Kheema Muttilu | మటన్ కీమ ముట్టిలు
తయారికి కావాల్సిన పదార్థాలు :
- మటన్ కీమ : 250 గ్రా
- ఉప్పు, కారం, పసుపు : తగినంత
- గరం మసాలా : 1 స్పూన్
- ధనియాల పొడి : 1 స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్టు : 2 స్పూన్స్
- నిమ్మ రసం : 2 స్పూన్స్
- కొత్తిమీర
- కోడిగుడ్డు : 1
- నూనె తగినంత
తయారు చేయు విధానం :
- మిక్స్ జార్ తీసుకోని దానిలో కడిగిన మటన్ కీమ వేసి మెత్తగా మిక్స్ చేసాక దానిలో తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి, కోడిగుడ్డు పగల గొట్టి పోసి మిక్స్ మరోసారి చేయాలి .
- ఈ కీమను చిన్న ముద్దలుగా చేసి పక్కనపెట్టాలి.
- స్టవ్ ఫై కడాయి పెట్టి ముట్టిలకు తగినంత నూనె పోసి వేడి అయ్యక ముట్టిలను అన్నింటిని ఒకేసారి వేసి బాగా ఉడికేదాక మగ్గనివ్వాలి, నీరు ఎ మాత్రం లేకుండా ముట్టిలను వేగనివ్వాలి.
- చివరగా బాగా వేగిన ముట్టిల ఫై 2 స్పూన్స్ నిమ్మరసం, కొత్తిమీర చల్లుకోవాలి.
- ఈ ముట్టిలు ఒక వారం పాటు నిల్వ ఉంటాయి.