Ravva Laddu । Sooji Laddu (రవ్వ లడ్డు)
తయారికి కావలసిన పదార్థాలు :
- బొంబాయి రవ్వ : 1 కప్పు
- ఎండు కొబ్బరి తురుము : 1 కప్పు
- పంచదార : 1 కప్పు
- నెయ్యి : 5 స్పూన్స్
- ఇలాచి పొడి : 1/2 స్పూన్
- కిస్మిస్స్, జీడి పప్పు తగినన్ని
- పాలు : 1కప్పు
తయారి చేయు విధానం :
- స్టవ్ ఫై కడాయి పెట్టి వేడయ్యాక 1 స్పూన్ నెయ్యి వేసి రవ్వను పోసి వేగనివ్వాలి, తరువాత ఎండు కొబ్బరి ని కూడా వేసి వేగనివ్వాలి. పంచదారను మిక్స్ పట్టీ పోడిలా చేసుకొని పక్కన పెట్టాలి .
- చిన్న కడాయి లో నెయ్యి పోసి కాజు, కిస్మిస్స్ వేసి వేగాక వాటిని వేయించిన రవ్వలో వేయాలి . ఈ మిశ్రమం లో ఎండు కొబ్బరి తురుము , యాలకుల పొడిని , షుగర్ పొడిని కలపాలి . చివరగా ఈ మిశ్రమం చల్లారక ముందే పాలు పొస్తూ లడ్డులా వత్తుకోవాలి .
- పాలు కాకుండా వేడి నెయ్యే తో గాని లడ్డులను చేసుకోవచ్చు.