Advertisement

Main Ad

Stuffed Bendi | గుత్తి బెండకాయ శాకం

Stuffed Bendi | గుత్తి బెండకాయ శాకం


కావలసిన పదార్థాలు :

  1. బెండకాయలు : 250 గ్రాములు
  2. కరివేపాకు, కొత్తిమీర 
  3. అల్లం వెల్లుల్లి పేస్టు 
  4. తగినంత ఉప్పు, కారం, పసుపు 
  5. పోపు దినుసులు : 1 స్పూన్ 
  6. గరం మసాలా : 1/2 స్పూన్ 
  7. నునే :3స్పూన్ 
  8. పల్లి, నువ్వుల పౌడర్ : 3 స్పూన్ 
  9. చాట్ మసాలా 

తయారు చేయు విధానం :

  • ముందుగ కడిగిన బెండకాయలను తీసుకోని ముందు, చివరలను కట్ చేసుకొని ,బెండకాయలను నిలువుగా కట్ చేసుకొని  పక్కన పెట్టాలి.
  • మసాలా తయారికి ఒక ప్లేట్ తీసుకోని దానిలో కారం,ఉప్పు ,పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చాట్ మసాలా, పల్లి , నువ్వుల పొడిని వీటన్నింటిని కలిపి ముద్దలా చేసుకోవాలి.
  • కట్ చేసిన బెండకాయలను తీసుకోని దానిలో మనం తయారు చేసిన మసాలాలను నింపి పక్కన పెట్టాలి .
  • స్టవ్ ఫై గిన్నె పెట్టి కూరకి తగినంత నునె పోసాక పోపు దినుసులను, కరివేపాకు వేసాక ఈ మసాలా నింపిన బెండకాయలను వేసి మగ్గనివ్వాలి . బెండకాయలు పూర్తిగా మగ్గాక స్టవ్ ఆపేసి కొత్తిమీర వేయాలి . ఇప్పుడు నోరిరించే గుత్తి బెండకాయ తయారువుతుంది.