Advertisement

Main Ad

BUTTER CHICKEN | వెన్నెతో కోడి కూర

BUTTER CHICKEN | వెన్నెతో కోడి కూర


తయారికి కావలసిన పదార్థాలు : 

  1. బోన్ లెస్ చికెన్ : 500 గ్రా 
  2. టమాటో రసం : 2 కప్ 
  3. అల్లం వెల్లులి పేస్టు : 4 స్పూన్స్ 
  4. ఉప్పు , కారం : తగినంత 
  5. వెన్న ( బట్టర్ ) : 5 స్పూన్స్ 
  6. పసుపు : 1 స్పూన్ 
  7. పెరుగు : 1 కప్పు 
  8. నిమ్మరసం : 3 స్పూన్స్ 
  9. గరం మసాలా దినుసులు : 1 స్పూన్ 
  10. ధనియా పొడి : 1 స్పూన్ 
  11. కొత్తిమీర 
  12. గరం మసాలా పొడి : 1 స్పూన్ 
  13. కసూరి మేతి : 1 స్పూన్ 
  14. నూనె

తయారి చేయు విధానం :

  • ఒక బౌల్ లో చికెను తీసుకోని దానిలో పసుపు,  అల్లం వెల్లులి పేస్టు, ఉప్పు, కారం, ధనియా పొడి, పెరుగు, నిమ్మ రసం కలిపి 2 గంటల పాటు రిఫ్రిజిరిటర్లో పెట్టాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి నునె వేసి చికెన్ బాగా ఫ్రై చేసుకొని పక్కనపెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్ ల వెన్నె వేసి వేడి అయ్యాక  అందులో గరం మసాలా దినుసులు వేసి వేగాక అల్లం వెల్లులి పేస్టు వేసి టమాటో రసాన్ని కూడా వేసి బాగా వేగాక అందులో ఉప్పు, కారం , గరం మసాలా పొడి, కసూరి మేతి పొడిని వేసి బాగా ఉడకనివ్వాలి.
  • ఇలా ఉడికిన టమాటో రసంలో చికెన్ వేసి బాగా ఉడికించాలి, అనగా నూనే  పైకి వచ్చొంత వరకు ఉడికించాలి, చివరగా కొత్తిమీరను చల్లి తినడానికి సిద్ధం చేసుకోవాలి.