Advertisement

Main Ad

Chicken Pakoda

Chicken Pakoda | చికెన్ పకోడి


తయారికి కావలసిన పదార్థాలు : 

  1. బోన్ లెస్ చికెన్ : 250 గ్రా 
  2. గరం మసాలా : 1/2 స్పూన్ 
  3. ధనియాల పొడి : 1స్పూన్
  4. కారం : 1 స్పూన్
  5. ఉప్పు : తగినంత
  6. కార్న్ ఫ్లోర్ : 2 స్పూన్స్
  7. కొత్తిమీర
  8. పసుపు : 1/2 స్పూన్
  9. అల్లం వెల్లుల్లి పేస్టు ; 2 స్పూన్స్
  10. నూనె
  11. ఉల్లి ముక్కలు : 1
  12. కోడిగుడ్డు తెల్ల సొన : 1 కప్పు

తయారు చేయు విధానం : 

  • శుబ్రంగా కడిగిన చికెన్ ను ఒక గిన్నెలొ వేసి అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లులి పేస్టు, కోడిగుడ్డు తెల్ల సొన వేసి బాగా కలిపి అర గంట పాటు పక్కన పెట్టాలి. 
  • ఇప్పుడు స్టవ్ ఫై కడాయి పెట్టి పకోడి చేసుకోవడానికి తగినంత నూనె పోసి బాగా వేడి కానివ్వాలి. ఇలా నూనె వేడి అయ్యాక చికెన్ ఒకొక్క ముక్కను తీసుకోని కార్న్ ఫ్లోర్ పౌడర్ లో ముంచి నూనెలొ వేసి పకోడి చేసుకోవాలి. 
  • వీటిని ఉల్లి ముక్కలు, ధనియాల పొడి, కొత్తిమీరతో అలంకరించుకొని తింటే చాలా బాగుంటుంది.