Advertisement

Main Ad

Lemon Chicken | నిమ్మ చికెన్

Lemon Chicken | నిమ్మ చికెన్


తయారికి కావాల్సిన పదార్థాలు :

  1. చికెన్ : 500 గ్రా 
  2. నిమ్మ రసం : 1/2 కప్పు 
  3. అల్లం వెల్లుల్లి పేస్టు : 2స్పూన్స్ 
  4. పసుపు, ఉప్పు, కారం : తగినంత 
  5. నూనె 
  6. జీలకర్ర
  7. ధనియాల పొడి : 1 స్పూన్ 
  8. గరం మసాలా : 1 స్పూన్ 
  9. టమాట : 2
  10. ఉల్లి గడ్డ : 1 
  11. ఆలుగడ్డ : 1
  12. పచ్చి మిర్చి : 5 
  13. కరివేపాకు, కొత్తిమీర 
  14. పెరుగు : 1 కప్పు 

తయారు చేయు విధానం : 

  • 500 గ్రా చికెన్ తీసుకోని శుబ్రంగా కడిగి పక్కన పెట్టాలి. చికెన్ కు పసుపు, అల్లం వెల్లులి, పెరుగు, కారం, కొంచెం ఉప్పు, దనియ పొడి, గరం మసాలా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టాలి.
  • మిక్స్ జార్ లొ టమాటో, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, పచ్చి మిర్చి వేసి మిక్స్ చేసి పెట్టాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి నూనె పోసి జీలకర్ర, కరివేపాకు వేసాక నానబెట్టిన చికెన్ ను వేసి కాస్త వేగాక మిక్స్ చేసిన రసాన్ని కూడా వేసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
  • ఇలా మగ్గిన చికెన్ లో నిమ్మ రసం వేసిన తరువాత కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
  • మనకు కావాల్సిన పుల్లటి చికెన్ తయారు అవుతుంది.