Advertisement

Main Ad

Mutton Paya | మేక కాళ్ళ రసం

Mutton Paya | మేక కాళ్ళ రసం


తయారికి కావాల్సిన పదార్థాలు :

  1. కట్ చేసిన మేక కాళ్ళు : 8 
  2. ఉల్లి గడ్డలు : 4 
  3. అల్లం వెల్లులి పేస్టు : 4 స్పూన్స్ 
  4. పసుపు  : 1 స్పూన్ 
  5. ఉప్పు, కారం : తగినంత 
  6. మిరియాల పొడి : 1 స్పూన్ 
  7. ధనియాల పొడి : 1 స్పూన్ 
  8. గరం మసాలా : 1స్పూన్ 
  9. పుదినా, కొత్తిమీర : తగినంత 
  10. పెరుగు :  1 కప్పు 
  11. నూనె : తగినంత 
  12. నీళ్ళు : 1 1/2 లీటర్ 

తయారు చేయు విధానం : 

  • కట్ చేసుకున్న మేక కాళ్ళను పసుపు, పిండి వేసి శుబ్రంగా 2, 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. 
  • ప్రేస్సర్ కుక్కర్ ను తీసుకోని స్టవ్ ఫై పెట్టి నూనె పోసి తరిమిన ఉల్లి ముక్కలు , పుదినా వేసాక మేక కాళ్ళను వేసి కొంచెం వేడి అయ్యాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, రసంకు తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 
  • 1 కప్పు పెరుగును మగ్గుతున్న కూరలో వేసాక 2 నిమిషాల తరువాత రసంకు తగినంత నీటిని పోసి కుక్కర్ మూత పెట్టి 5, 6 విసిల్స్ వచ్చేంత వరకు వేచి ఉండాలి. 
  • చివరగా కుక్కర్ మూత తీసి కాళ్ళు ఉడికాయ లేదా చూసి ధనియ, గరం మసాలా పొడిలు వేసాక కొత్తిమీర కూడా వేసి 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 
  • జలుబు చేసిన వారికి, బలహీనంగా ఉన్న వారు ఈ మట్టన్ పాయ తింటే చాల ఆరోగ్యం గా ఉంటారు.