Advertisement

Main Ad

Curry Crab

Curry Crab | పీతల కూర



తయారికి కావలసిన పదార్థాలు :

  1. పీతలు : 250 గ్రా 
  2. కొబ్బరి గసాల పేస్టు : 1/2 కప్పు 
  3. చింతపండు రసం : 1/2 కప్పు 
  4. సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు : 1 కప్పు 
  5. టమాటో పేస్టు : 1/2 కప్పు 
  6. నూనె 
  7. అల్లం వెల్లులి పేస్టు : 2 స్పూన్స్ 
  8. పచ్చి మిర్చి : 5 
  9. పసుపు , ఉప్పు , కారం : తగినంత 
  10. జీలకర్ర మెంతి పొడి : 1 స్పూన్ 
  11. ధనియాల పొడి : 1 స్పూన్ 
  12. గరం మసాలా : 1/2 స్పూన్ 
  13. పుదినా, కొత్తిమిర 

తయారీ చేయు విధానం : 

  • స్టవ్ ఫై కడాయి పెట్టి 5 స్పూన్స్ నూనె పోసి వేడియ్యకా సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసి వేగాక పచ్చిమిర్చి, పుదినా వేయాలి. ఇవి వేగాక అల్లం వెల్లులి పేస్టు వేసి కాస్త పసుపు వేయాలి తరువాత టమాటో పేస్టు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గుతుండగా కురకు తగినంత ఉప్పు, కారం వేయాలి. 
  • ఇపుడు ఈ మిశ్రమంలో కొబ్బరి గసాల పేస్టు వేసి బాగా కలుపుతూ ఉండగా జీలకర్ర మెంతి పొడి వేయాలి. 
  • చింతపండు రసం కూడా వేసి బాగా 10 నిమిషాల పాటు  మగ్గనివ్వాలి, ఇలా మగ్గుతున్న కూరలో పీతలు వేసి కలుపుకోవాలి. ఇక 10 నిమిషాల పాటు పితలను ఉడకనివ్వాలి, చివరగా కొత్తిమిర, దనియాల పొడి, గరం మసాలా వేసి స్టవ్ కట్టేయాలి.