Advertisement

Main Ad

Dum ka Tomato for Veg Biryani

Dum ka Tomato | టమాటో శాకం


తయారికి కావలసిన పదార్థాలు :

  1. టమాట : 250 గ్రా
  2. జీలకర్ర, ఆవాలు : 1 స్పూన్
  3. కరివేపాకు, కొత్తిమిర
  4. నూనే : 3 స్పూన్స్
  5. వేఇంచిన పల్లీలు , నువ్వులు , కొబ్బరి : 1 కప్పు
  6. చింతపండు రసం : 1 కప్పు
  7. ఎండుమిర్చి, పచ్చిమిర్చి : 4
  8. తరిగిన ఉల్లిగడ్డలు : 2
  9. అల్లం వెల్లులి పేస్టు : 1 1/2 స్పూన్
  10. పసుపు, ఉప్పు , కారం : తగినంత
  11. ధనియాల పొడి : 1 స్పూన్
  12. గరం మసాలా : 1/2 స్పూన్
  13. బెల్లం : 1 స్పూన్

తయారి చేయు విధానం :

  • స్టవ్ ఫై కడాయి పెట్టి నూనె వేసి వేడి ఇయక జీలకర్ర, ఆవాలు వేసాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేగాక  తరిగిన ఉల్లిగడ్డలను వేసి వేగాక కరివేయపకు వేసి అల్లం వెల్లులి పేస్టు కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి.
  • కూరలో తగినంత ఉప్పు, కారం, దనియాల పొడి వేసాక మిక్స్ పట్టిన పల్లీలు, నువ్వుల, కొబ్బరి మిశ్రమాన్ని వేసి 15 నిమిషాల పాటు మూత పెట్టి పెట్టాలి.
  • ఈ ఉడుకుతున్న మిశ్రమంలో ఒక కప్పు చింతపండు రసం పోయాలి, 5 నిమిషాల పాటు మగ్గాక కడిగిన టమాటో లను కొంచెం విత్తనాలు తీసినట్టు చేసి వాటిని కూరలో వేసి బాగా మగ్గనివ్వాలి.
  • చివరగా గరం మసాలా , కొత్తిమిర వేసి రుచి చూసుకోవాలి.
  • ఈ కూరను వెజ్ రైస్ లోకి తింటే చాల బాగుంటుంది.