Advertisement

Main Ad

Fish Soup | చేపల పులుసు

Fish Soup | చేపల పులుసు


తయారికి కావలసిన పదార్థాలు :

  1. చేపలు  : 1 కే జి 
  2. ఉల్లిగడ్డలు : 5
  3.  పుదిన , కరివేపాకు , కొత్తిమిర 
  4. అల్లం వెల్లులి పేస్టు : 3 స్పూన్స్ 
  5. పసుపు , ఉప్పు , కారం : తగినన్ని 
  6. నునే 
  7. చింతపండు రసం : తగినని 
  8. జీలకర్ర , మెంతి పొడి : 1 స్పూన్ 
  9. ధనియాల  పొడి : 1 స్పూన్ 
  10. నువ్వుల పొడి : 3 స్పూన్స్
  11. పెరుగు : 1 కప్పు  

తయారీ చేయు విధానం  :  

  • మెదటగా చేప  ముక్కలను ఉప్పు వేసి బాగా 4 , 5 సార్లు కడిగి తెల్లగా కడగాలి . తరువాత వాటిలో 1/2 స్పూన్ పసుపు , పెరుగు వేసి ఒక అర గంట పాటు నానబెట్టాలి.
  • ఈ చేప ముక్కలను వేరొక గిన్నెలో తీసుకోని వాటికీ  తగినంత ఉప్పు, ఎండు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి  పేస్టు  వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై వెడల్పాటి గిన్నె పెట్టి పులుసు కి తగినంత నూనే వేసాక నూనె లో కడిగిన పుదినా, ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా వెంచుకున్నాక పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపాక మసాలా కలిపిన చేప ముక్కలను వేసి 5 నిమిషాల పాటు మగ్గాక చింతపండు రసం వేసి బాగా మరుగుతూ వుంటే ఆ సమయంలో జీలకర్ర, మెంతి పొడి, నువ్వుల పొడి, దనియ పొడి ఒక దాని తరువాత ఇంకొకటి వేస్తుండాలి.
  • చివరగా కరివేపాకు, కొత్తిమిర వేసి ఉప్పు, కారం తగినంత ఉందా చూసుకొని స్టవ్ కట్టేయాలి. 
  • ఈ చేపల పులుసు ను వండిన మరుసటి రోజు తింటే చాల రుచిగా ఉంటుంది.
  • గరిట మాత్రం వాడకూడదు ఈ చేపల పులుసుకు.