శుబ్రపరచిన చికెన్ ఒక బౌల్ లో తీసుకోని దానిలో పసుపు , ఉప్పు , కారం , అల్లం వెల్లులి పేస్టు, పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
కాజు , బాదం రెండింటిని కలిపి నీళ్ళు పోస్టు మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి.
బాగా మరిగిన కొన్ని నీళ్ళలో కసూరి మేతి వేసి 2 నిమిషాల తరువాత వాటిని వడకట్టాలి, పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై కడాయి పెట్టి కూరకి తగినంత నూనె వేసి వేడి అయ్యాక నూనెలొ తరిగిన ఉల్లిగడ్డలు, గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లులి వరుసగా ఒకదాని తరువాత మరొకటి వేసి వేగిన తరువాత నానపెట్టిన చికెన్ వేసి కాసేపు మగ్గనివ్వాలి.
మగ్గుతున్న మిశ్రమంలో కాజు, బాదాం మిక్స్ ని, ఫ్రెష్ క్రీం వేసాక 5 నిమిషాల తరువాత కసూరి మేతి కూడా వేసి బాగా కలుపుకున్నాక చివరగా ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కొద్ది సేపు మగ్గనిచ్చాక స్టవ్ కట్టేయాలి.