Advertisement

Main Ad

Cabbage Vada | Moong Dal Cabbage Vada

Cabbage Vada | Moong Dal Cabbage Vada


తయారికి కావాల్సిన పదార్థాలు :

  1. తురిమిన క్యాబేజీ : 2 కప్పులు
  2. నానబెట్టిన మినపప్పు : 2 కప్పులు
  3. పచ్చిమిర్చి : 5
  4. సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు : 1/2 కప్పు
  5. అల్లం : 1
  6. జీలకర్ర : 1 స్పూన్
  7. కరివేపాకు, కొత్తిమిర
  8. ఉప్పు : తగినంత
  9. నూనె

తయారి చేయు విధానం :

  • మినపప్పును ముందు రోజు రాత్రి నానపెట్టి ఉంచాలి.
  • కడిగిన క్యాబేజీని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
  • మినపప్పును నీరు లేకుండా వడబోసి మిక్స్ జార్ లో తీసుకోని పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి . తురిమిన కాబజిలో నీళ్ళు లేకుండా ఉండాలి.
  • ఇప్పుడు మిక్స్ చేసిన మినప పిండిని, క్యాబేజీ తురుమును, ఉప్పు, తరిగిన ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమిర వేసి కలుపుకోవాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి తగినంత నూనె వేసి మరిగాక పిండిని వడల్లాగా  వత్తుకొని వేసుకోవాలి. 
  • వీటికి టమాటో చెట్నితో తింటే చాల రుచిగా ఉంటాయి.