ఒక గిన్నెలో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పౌడర్, కొద్దిగా నీళ్ళు వేసి కలిపి అందులో పన్నీర్ వేయాలి. స్టవ్ ఫై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి తగినంత నూనె వేసి మరిగాక అందులో పన్నీర్ ఒక్కొక్క ముక్క వేస్తూ బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై మరొక గిన్నె పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, తరిగిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి పేస్టు, కరివేయపకు, కాప్సిచుం మరియు పసుపు వేసి కాసేపు మగ్గనివాలి.
ఇపుడు వేయించిన పన్నీర్ ముక్కలను కూడా వేసి 2 స్పూన్స్ సోయా సాస్, తగినంత ఉప్పు, కారం వేసాక 5 నిమిషాల తరువాత ధనియాల పొడి, కొత్తిమిర వేసి బాగా కలుపుకొని స్టవ్ కట్టేయాలి.