Dahi Vada | పెరుగు వడ
తయారికి కావలసిన పదార్థాలు :
- మినపప్పు : 250 గ్రా
- పెరుగు : 200 గ్రా
- ఉప్పు : తగినంత
- పోపు దినుసులు
- నూనె
- కొత్తిమిర, కరివేపాకు
- పచ్చిమిర్చి : 5
- ఎండుమిర్చి : 2
తయారు చేయు విధానం :
- 10 గంటల పాటు నానపెట్టిన మినపప్పును వడకు తగినట్టుగా మిక్స్ చేసి స్టవ్ ఫై కడాయి పెట్టి నూనె వేసి వడలను చేసి పక్కన పెట్టుకోవాలి.
- కొత్తిమిర, పచ్చిమిర్చ, 1 స్పూన్ జీలకర్ర వేసి కాస్త నీరు పోసి మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి కలపాలి. తరువాత పెరుగు వడలు మెత్తగా రావడానికి వడలను కొన్ని నీళ్ళలో 1 స్పూన్ ఉప్పు వేసి ఈ వడలను వేసి ఒక అరగంట పాటు నానపెట్టి నీళ్ళు లేకుండా వత్తెసి తీసి వీటిని పెరుగు మిశ్రమంలో వేయాలి.
- ఈ మిశ్రమంలో పోపు వేసి కాసేపు ఇయ్యాక మనం తినడానికి చల్ల చల్లని పెరుగు వడ సిద్దం.