Advertisement

Main Ad

Dal Palak | పాలకూర పప్పు

Dal Palak |  పాలకూర పప్పు


తయారికి కావలసిన పదార్థాలు :

  1. తరిగిన పాలకూర : 2 కప్పులు 
  2. టమాటో : 2 
  3. తరిగిన ఉల్లిగడ్డలు : 1/2 కప్పు
  4. చింతపండు : 1/4 కప్పు
  5. ఇంగువ : చిటికెడు
  6. నూనె
  7. ఎండుమిర్చి : 4
  8. పచ్చిమిర్చి : 4
  9. వెల్లులి రెబ్బలు : 6
  10. పసుపు , ఉప్పు : తగినంత
  11. పోపు దినుసులు : 1 స్పూన్
  12. కరివేపాకు, కొత్తిమిర

తయారీ చేయు విధానం :

  • పాలకూర ను కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • పప్పు కుక్కర్ లో కంది పప్పు వేసి 2, 3 సార్లు కడిగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, టమాటో ముక్కలు, పసుపు వేసి కలిపి ముత పెట్టి 2 విసిల్స్ వచ్చేంత వరకు స్టవ్ ఫై పెట్టాలి.
  • ఇలా 2 విసిల్స్ వచ్చాక ముత తీసి కడిగిన పాలకూర, చింతపండు ,ఉప్పు వేసి కలిపి మరొక విసిల్ వచ్చే వరకు స్టవ్ ఫై పెట్టాలి . పప్పు ఉడికాక దాన్ని పప్పు గుత్తి తో రుబ్బి ఉంచాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక ఎండుమిర్చి, పోపు దినుసులు, చిటెకెడు ఇంగువ, నలిపిన వెల్లులి రిబ్బలు, కరివేపాకు మరియు పసుపు వేసి దానిలో ఉడికించిన పప్పు వేయాలి.
  • చివరగా కొత్తిమిర ను కూడా వేసి రుచి సరి చూసుకోవాలి.