Drumstick Coconut Milk Curry । మునక్కాయ కొబ్బరి పాల కూర
తయారికి కావలసిన పదార్థాలు :
మునక్కాయలు : 4
పచ్చి కొబ్బరి పాలు : 1 కప్పు
తరిగిన ఉల్లిగడ్డలు : 1/2 కప్పు
అల్లం వెల్లులి పేస్టు : 2 స్పూన్
గసాల, ధనియాలు, కాజు పేస్టు : 1 కప్పు
పచ్చిమిర్చి : 5
కరివేపాకు, కొత్తిమిర
పసుపు, ఉప్పు, కారం : తగినంత
గరం మసాలా పొడి : 1స్పూన్
ఆవాలు, జీలకర్ర : 1 స్పూన్
నూనె
తయారీ చేయు విధానం :
ముందుగా మునక్కయలను కట్ చేసుకొని నార తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై గిన్నె పెట్టి కురకి తగినంత నూనె పోసి వేడెక్కాక ఆవాలు , జీలకర్ర వేసి తరిగిన ఉల్లిగడ్డలు వేసి వేగాక కరియపకు , పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అల్లం వెల్లులి , పసుపు వేసి కొంచెం మగ్గనివ్వాలి.
తరువాత గసాల, ధనియాల, కాజు పేస్టు వేసి 2 నిమిషాల తరువాత కారం, ఉప్పు వేసి కొబ్బరి పాలు కూడా వేసి 5 నిముషాలు మగ్గనివ్వాలి.
చివరగా మునక్కాయలు వేస్ అవి ఉడికేధకా మగ్గ నిస్తూ అవసరం ఐతే కాస్త నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి.
గరం మసాలా, కొత్తిమిర కూడా వేసి కూరకి తగినంత ఉప్పు, కారం సరిపడినంత ఉందొ లేదో చూసుకొని స్టవ్ కట్టేయాలి.