మెదటగా కొన్ని మరిగించిన నీళ్ళలో శుబ్రపరచిన గోబిని వేసి చిటికెడు పసుపు, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు ఉంచి తరువాత వడపోయాలి.
స్టవ్ ఫై కడాయి పెట్టి 2 స్పూన్స్ నునె వేసాక అందులో వడబోసిన గోబీ వేసిన తరువాత వరుసగా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియాల్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్ని కొద్ది కొద్దిగా వేసి కొంచెం గోబిని మగ్గనివ్వాలి.
మరొక కడాయి ని స్టవ్ ఫై పెట్టి 4 స్పూన్స్ వెన్నె వేసి అది కరిగాక జీలకర్ర, గరం మసాల దినుసులు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిగడ్డలు వేసాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి తరువాత తరిగిన టమాటో ముక్కలను వేసి ఉడకనివ్వాలి కారం, ఉప్పు, గరం మసాలా వేయాలి.
ఇవన్ని కొంచెం చల్లారిన తరువాత కాజు వేసి అన్నింటిని కలిపి మెత్తగా మిక్స్ చేయాలి, ఈ మిశ్రమం అంత ఫ్రై చేసుకున్న గోబీ ఉన్నకడాయి లో వేసి కలిపాక ఫ్రెష్ క్రీం, కొత్తిమిర వేసి వడ్డించుకోవాలి.