Advertisement

Main Ad

Kadai Paneer | Kadai Paneer Recipe

Kadai Paneer | Kadai Paneer Recipe

తయారికి కావలసిన పదార్థాలు :

  1. పనీర్ : 200 గ్రా
  2. కాప్సికం : 1 కప్పు
  3. టమాటో : 1 కప్పు
  4. కాజు : 3 స్పూన్
  5. తరిగిన ఉల్లిగడ్డలు : 1 కప్పు
  6. వెన్న : 2 స్పూన్
  7. గరం మసాలా : 1 స్పూన్
  8. ఉప్పు
  9. నూనె
  10. సన్నగా తరిగిన అల్లం వెల్లులి ముక్కలు : 2 స్పూన్

తయారి చేయు విధానం :

  • స్టవ్ ఫై కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత నూనె పోసి వేడెక్కాక తరిగిన పనీర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి 2 స్పూన్ ల నూనె వేసి వేడి అయ్యాక తరిగిన అల్లం వెల్లులి, ఉల్లిగడ్డలు, టమాటోలు వేసి, కొంచెం ఉప్పు వేసి వేగిన తరువాత మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • అదే కడాయి లో వెన్నె వేసి వేగిన తరువాత కాప్సికం వేసి, టమాటో, కాజు మిక్స్ పట్టిన మిశ్రమం వేసి 5 నిమిషాల పాటు మగ్గాక వేయించిన పన్నీర్ ముక్కలను వేసి 2 నిమిషాల పాటు గరం మసాలా వేసి మగ్గనివ్వాలి.
  • ఈ కడాయి పనీర్ ను చేపతిలో తీసుకోని తింటే చాల రుచిగా ఉంటుంది.