Advertisement

Main Ad

Methi Dal | మెంతి కూర పప్పు

Methi Dal  | మెంతి కూర పప్పు


తయారికి కావలసిన పదార్థాలు :

  1. మెంతి కూర : 2 కప్పు లు
  2. కంది పప్పు : 1 కప్పు
  3. టమాటో : 1
  4. పచ్చిమిర్చి : 5
  5. ఎండు మిర్చి : 2
  6. ఆవాలు, జీలకర్ర : 1 స్పూన్
  7. నూనె
  8. వెల్లుల్లి రిబ్బలు : 5
  9. పసుపు , ఉప్పు , కారం : తగినంత
  10. కొత్తిమీర

తయారు చేయు విధానం :

  • కంది పప్పును కడిగి చిటికెడు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై వెడల్పాటి గిన్నె పెట్టి నునె వేసి ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రిబ్బలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన మెంతి కూర ఆకులను వేసి కలిపాక 2నిమిషాల తరువాత తరిగిన టమాటో ముక్కలను వేసి కాస్త పసుపు  వేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
  • ఇపుడు ఉడికించిన కందిపప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు, కారం, కొత్తిమీర వేసి కొంచెం సేపు ముత పెట్టి మగ్గనివ్వాలి.
  • మనకు కావలసిన మెంతి కూర పప్పు తయారు అయింది.