స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లులి పేస్టు వేసి వేగిన తరువాత పచ్చికొబ్బరి తురుము వేసి బాగా మగ్గనివ్వాలి .
ఇప్పుడు పసుపు, కారం, గరం మసాలా, వేసి కలిపాక టమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
తరువాత తరిగిన క్యారెట్, బంగాళా దుంప, క్యాబేజీ వేసి కలిపిన తరువాత తగినంత ఉప్పు వేసి గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
చివరకు కొత్తిమీర, సోంపు పౌడర్ వేసి కలిపి స్టవ్ కట్టేయాలి.