పచ్చి కొబ్బరి తురుము, ఒక స్పూన్ జీలకర్ర, 5 పచ్చిమిర్చిలు, మిరియాలు, కొంచెం పసుపు వేసి మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి.
కాబూలి శెనగలు, కందిపప్పు ను 12 గంటల పాటు నానబెట్టాలి. అలాగే పొట్లకాయను ముక్కలుగా చేసి కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఫై గిన్నె అది వేడి అయ్యాక 3 స్పూన్స్ నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఉడికించిన పొట్లకాయ ముక్కలను వేసి కాస్త పసుపు వేసాక మిక్స్ చేసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
తరువాత దీనిలో నానపెట్టిన శెనగలు, కందిపప్పు వేసి కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి, కొంచెం ఉప్పు వేయాలి.
పోపు కు సరిపడింత నూనె వేసి జీలకర్ర, మినపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఈ పోపును ఉడికిన కూర మిశ్రమంలో వేసిన తరువాత చివరగా కొత్తిమిరను వేయాలి.