బోన్ లెస్ చికెన్ తీసుకోని కడిగి తడి లేకుండా చూసుకొని ఒక బౌల్ లో వేసుకొని దానిలో 1 స్పూన్ తందూరి మసాలా, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లులి పేస్టు, పెరుగు, నేయి, 1 స్పూన్ నూనె, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
ఈ సమయంలో మైదా పిండి లో కొంచెం ఉప్పు వేసి చేపాతి పిండిల తడిపి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై గిన్నె పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి తరిగిన ఉల్లిగడ్డలను వేసి కొంచెం మగ్గాక నానపెట్టిన చికెన్ వేసి బాగామగ్గే వరకు మూత పెట్టి ఉంచాలి. చికెన్ ఉడికిన తరువాత కొత్తిమిర చల్లి స్టవ్ కట్టేయాలి.
ఇప్పుడు తడిపిన పిండి ముద్దను పరోటా మాదిరిగా చేసుకొని కాల్చుకోవాలి. తరువాత స్టవ్ ఫై పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేసి దాని మీద చేపాతి వేసి కాల్చుకోవాలి.
ఈ చేపాతిలో వండిన చికెన్ వేసి రోల్ మాదిరిగా చుట్టుకోవాలి.