బీరకాయను కొద్దిగా పొట్టు తీసి కడిగిన తరువాత మసాలా నింపే విధంగా బీరకాయను కట్ చేసుకొని పక్కనపెట్టుకోవాలి.
మసాలా తయారికి మిక్స్ జార్ లో పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, వెల్లులి రిబ్బలు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చింత పండు వేసి మిక్స్ చేయాలి కొద్దిగా నీళ్ళు పోసి కలిపి మరో సారి మిక్స్ చేసుకొని ముద్దను పక్కన పెట్టుకోవాలి.
కట్ చేసిన బీరకయలొ మసాలా ను నింపి పెట్టుకోవాలి.
స్టవ్ ఫై కడాయి పెట్టి 5 స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక ఆవాలు , జీలకర్ర , కరివేపాకు వేసి వేగాక మసాలా నింపిన బీరకయలను వేసి మిగిలిన మాసాలను కూడా అందులోనే వేయ్యాలి.
కొద్దిగా నీళ్ళు పోసి బాగా మగ్గనివ్వాలి, చివరగా కొత్తిమిరను చల్లి స్టవ్ కట్టేయాలి.