Advertisement

Main Ad

Carrot Rice

Carrot Rice

తయారికి కావలసిన పదార్థాలు :

  1. క్యారెట్ : 2 కప్పులు
  2. పచ్చి బఠానీ : 1కప్పు
  3. ఉల్లిగడ్డలు : 1/2 కప్పు 
  4. రైస్  : 4 కప్పులు
  5. కరివేపాకు, కొత్తిమిర : తగినంత
  6. ఆవాలు, జీలకర్ర : 1 స్పూన్
  7. నూనె : తగినంత
  8. పచ్చిమిర్చి : 6
  9. చోలే మసాలా పొడి : 1 స్పూన్
  10. ఉప్పు : తగినంత

తయారు చేయు విధానం :

  • స్టవ్ ఫై వెడల్పాటి కడాయి పెట్టి 5 స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక ఆవాలు , జీలకర్ర వేసి వేగాక తరిగిన ఉల్లి ముక్కలను , కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి . ఇపుడు పచ్చిమిర్చి , పచ్చి బటాణి వేసి 2 నిమిషాల తరువాత 1/2 స్పూన్ పసుపు వేయాలి . 
  • ఇపుడు తురిమిన క్యారెట్ వేసి బాగా కలుపుకొని కొంచెం వేగాక ఉడికించిన రైస్ కూడా వేసి ముద్దలు కట్టకుండా బాగా కలియపెట్టాలి. రైస్ కి సరిపడినంత ఉప్పు, చోలే మసాలా వేసి బాగా కలుపుకోవాలి చివరగా తరిగిన కొత్తిమిర ను కూడా వేసుకోవాలి
  • మనకు కావలసిన క్యారెట్ రైస్ రెడీ.