పచ్చిమిర్చి, కొత్తిమిర, కరివేపాకు అన్నింటిని కలిపి మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి.
కాజును కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసి కలిపి పసుపు, కొత్తిమీర పేస్టు కూడా వేసి బాగా కలుపుకోవాలి. నూనె కొంచెం తేలె వరకు మగ్గనివ్వాలి.
ఇప్పుడు కడిగిన చికెన్, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. పెరుగు వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి.
చివరగా కాజు పేస్టు కూడా వేయడం వల్ల మరింత రుచిగా చిక్కగా రసం వస్తుంది.