Advertisement

Main Ad

Gutti Vankaya Curry | Stuffed Egg Plant Curry| Stuffed Brinjal Curry

Stuffed Brinjal Curry | Stuffed Eggplant Curry । గుత్తివంకాయ కూర


తయారికి కావలసిన పదార్థాలు :

  1. వంకాయలు : 250 గ్రా
  2. ఉల్లిగడ్డలు : 2
  3. పచ్చిమిర్చి : 5
  4. పసుపు, కారం, ఉప్పు : తగినంత
  5. అల్లం వెల్లుల్లి పేస్టు : 2 స్పూన్స్
  6. కరివేపాకు, కొత్తిమీర
  7. గసాల : 2 స్పూన్స్
  8. కాజు : 10
  9. ధనియాల పొడి : 1 స్పూన్
  10. గరం మసాలా పొడి : 1 స్పూన్
  11. నూనె
  12. చింతపండు రసం : 1/2 కప్పు

తయారు చేయు విధానం :

  • వంకాయలను కడిగి మసాలా నింపే విధంగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళలో వేసి ఉంచాలి.
  • మసాలా తయారికి మిక్స్ జార్లో కాజు, గసాల వేసి మిక్స్ చేసాక అదే జార్ లో తరిగిన ఉల్లిగడ్డ, పచ్చ్చిమిర్చి వేసి మిక్స్ చేసి ఈ రెంటిని ఒక బౌల్ లో తీసుకున్నాక వీటిలో అల్లం వెల్లులి పేస్టు, గరం మసాలా పొడి, పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
  • ఇలా తయారు చేసిన మాసాలను కట్ చేసిన వంకయాలలో నింపాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక మసాలా నింపిన వంకాయలను జాగ్రత్తగా వేసి మూత పెట్టాలి. మిగిలిన మాసాలను కూడా అందులోనే వేసి మగ్గనివ్వాలి.
  • 5 నిముషాలు మగ్గాక రుచికి సరిపడినంత చింతపండు రసం వేసి కొంచెం కలుపుకోవాలి.
  • కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి కూడా వేసి మరింత సేపు కూరను మగ్గనివ్వాలి.
  • ఈ గుత్తి వంకాయ కూర ఎప్పుడు చిన్న మంట ఫై చేసుకొంటే చాల బాగుంటుంది.