Advertisement

Main Ad

Kaju Curry Recipe

Kaju Curry Recipe


తయారికి కావలసిన పదార్థాలు :

  1. కాజు : 150 గ్రా 
  2. టమాట పేస్టు : 1 కప్పు 
  3. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు : 1/2 కప్పు
  4. ఉల్లి గడ్డ పేస్టు : 1 కప్పు
  5. కాజు పేస్టు : 1 కప్పు
  6. పాలు : 1/2 కప్పు
  7. ఎండుమిర్చి : 3
  8. కసూరి మేతి పొడి : 1 స్పూన్
  9. నూనె
  10. గరం మసాలా దినుసులు : 2 స్పూన్
  11. బిర్యాని ఆకు : 2
  12. పసుపు, ఉప్పు, కారం : తగినంత
  13. కొత్తిమీర
  14. పంచదార : 1 స్పూన్
  15. గరం మసాలా పొడి : 1 స్పూన్

తయారు చేయు విధానం :

  • పచ్చిమిర్చి పేస్టు, కాజు పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు, టమాట పేస్టు అన్నింటిని విడి విడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. 
  • స్టవ్ ఫై కడాయి పెట్టి 5 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక కాజులను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • అదే గిన్నెలో గరం మసాలా దినుసులు, బిర్యాని ఆకు, ఎండుమిర్చి వేసి వేగాక పచ్చిమిర్చి పేస్టు వేసి పచ్చి వాసన పోయే అంత వరకు కలుపుకోవాలి. ఇపుడు ఉల్లిగడ్డ పేస్టు వేసుకొని కూడా కలిపి 2 నిమిషాల తరువాత టమాట పేస్టు వేసి మగ్గనివ్వాలి.
  • ఇపుడు పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, కసూరి మేతి పొడి, పంచదార వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి తరువాత మిక్స్ చేసిన కాజు పేస్టు వేసి తగినన్ని నీళ్ళు పోసి మగ్గనివ్వాలి.
  • చివరగా ఫ్రై చేసి ఉంచిన కాజులను, కొత్తిమిర వేసి కలిపి 2 నిమిషాల తరువాత స్టవ్ కట్టేయాలి.