చిన్న గిన్నెలో దనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, కసూరి మేతి పొడి, కొన్ని పాలు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై కడాయి పెట్టి అందులో 1 స్పూన్ వెన్నె వేసి అందులో పన్నీర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయి లో మరింత వెన్నె వేసి అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రై చేసిన ఉల్లిగడ్డ ముక్కలను వేసి వేగాక టమాటో రసం వేసి 5నిమిషాల తరువాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసి కాసేపటి తరువాత 1/2 కప్పు పాలు నెమ్మదిగా పోస్టు కలుపుకోవాలి.
ఇప్పుడు వేయించిన పన్నీర్ ముక్కలను వేసి కలిపాక తగినంత ఉప్పు వేసుకోవాలి.